Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న 'లెజెండ్' హీరోయిన్ నగ్నవీడియో

'లెజెండ్' హీరోయిన్ రాధికా ఆప్టే న్యూడ్ వీడియో వాట్సప్ లో చక్కర్లు కొడుతోందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తాను దర్శకత్వం వహించిన సినిమాలో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సప్ లో వీడియో చక్కర్లు కొడుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మధ్యనే రాధికా ఆప్టే బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేయగా, అందులో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్ చేశారని వివరణ ఇచ్చిన సంగతి తెలిసింది. తాజా వీడియోలోని దృశ్యాలు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ లోనివని ఆయన తెలిపారు.

More Telugu News